శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి బ్రహ్మరధం పట్టిన బొబ్బిలంక ప్రజలు

రాజానగరం, సీతానగరం మండలం రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకట లక్ష్మి దంపతులు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన “జనం కోసం జనసేన మహాపాదయాత్ర – ఆడపడుచులకు బొట్టు పెట్టె కార్యక్రమం” శుక్రవారం బొబ్బిలంక గ్రామంలో నిర్వహించడం జరిగింది. “జనం కోసం జనసేన మహాపాదయాత్ర – ఆడపడుచులకు బొట్టు పెట్టె కార్యక్రమం”లో భాగంగా సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామ పర్యటనలో భాగంగా బొబ్బిలంక గ్రామ ప్రజలు జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి బ్రహ్మరధం పట్టడం జరిగింది. అనంతరం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ఆడపడుచులకు బొట్టు పెట్టి జనసేన పార్టీ కరపత్రం, బ్యాడ్జ్, కీచైన్ లను ఇస్తూ రాబోయే ఎన్నికలలో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించి మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ బొబ్బిలంక గ్రామ ప్రజల ఆదరణ, ఆప్యాయత మరువలేనిదని అందరి చూపు జనసేన పార్టీ వైపు ఉందని, ఈ సారి విజయం తథ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.