Gajuwaka: బోరు బాగు చేయించి దాహార్తిని తీర్చిన జనసేన కార్పొరేటర్

గాజువాక నియోజకవర్గం 64 వ వార్డు గంగవరం గ్రామం, దార వీధి వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత రెండు సంవత్సరాల నుండి మంచినీళ్లు బోరు మూత పడిందని… ఇప్పటి వరకు ఎవరికి చెప్పినా పట్టించుకోలేదని… 64 వ వార్డు కార్పొరేటర్ శ్రీ దల్లి గోవిందరాజు దగ్గరకు సమస్య చెప్పిన 24 గంటల్లో సమీక్షించి 64వ వార్డు కార్పొరేటర్ సమస్యని పరిష్కరించారు. వారికి మంచినీళ్లు అందే విధంగా మంచినీళ్లు బోరుకు కావలసిన సామాగ్రిని… జీవీఎంసీ అధికారులతో మాట్లాడి రప్పించి బాగు చేయించగా స్థానిక ప్రజలు శ్రీ గోవిందరాజుకు అభినందనలు తెలియజేశారు. గంగవరం జనసేన నాయకులకు, జనసైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంట్ అధికార ప్రతినిధి సిహెచ్ ముసలయ్య, మాజీ సోషల్ జస్టిస్ నూకరాజు, మెగా నూకరాజు, ఫ్ ణ్ ఋ జానీ, కోదండరావు, అప్పలరాజు, రాజు, శ్రీను, శివాజీ, కోటి దానయ్య, పెంటయ్య, కృష్ణారావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.