ప్రజా సమస్యలు తెలుసుకున్న జనసేన కనపర్తి మనోజ్ కుమార్

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండలం, ముప్పాళ్ళ గ్రామంలో శనివారం పొన్నలూరు మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ బృందం పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. బిసి కాలనీల్లో సిసి రోడ్లు లేవు, సైడ్ కాలువలు లేవు, కొన్ని కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు లేవు, మల్లవరపు వెంకటేశ్వర్లు (67) అనే వ్యక్తికి మూడు నెలలు పెన్షన్ ఇచ్చి కక్షపూరితంగా వైసిపి నాయకులు పెన్షన్ తీసివేయడం జరిగింది. మల్లవరపు నాగేశ్వరరావు, కోసూరి సుధాకర్, కోసూరి సురేష్ అనే వారికి ఉండటానికి ఇల్లు కూడా లేవు. జగనన్న కాలనీ కింద ఇల్లు ఇప్పిస్తామని వైసిపి నాయకులు మాయ మాటలు చెప్పి ఈరోజు మొహం చాటేస్తున్నారు. నూతలపాటి చిన్నమ్మాయి (64) భర్త పేరు వెంకటేశ్వర్లు(భర్త చనిపోయాడు) ఆమెకి ఇప్పటివరకు ఎటువంటి పెన్షన్ ఇవ్వడం లేదు. అదేవిధంగా మల్లవరపు వెంకటేశ్వర్లు తండ్రి పేరు నాగయ్య ఈయన కూడా పెన్షన్ కి అర్హుడు,
ముప్పాళ్ళ గ్రామంలో అధికారులు మరియు వైసీపీ నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, పట్టిపట్టనట్టుగా ఉంటూ, అమాయకమైన ప్రజలను మోసం చేస్తూ, వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ, ప్రభుత్వం నుండి రావలసినటువంటి సంక్షేమ పథకాలు రానివ్వకుండా చేస్తూ, అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరంలో ఉండే విధంగా ఈ ముప్పాళ్ళ గ్రామ ప్రజలు ఉండటాన్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉంది, వైసీపీ నాయకులకు జనసేన రాబోయే రోజుల్లో కచ్చితంగా సరైన గుణపాటాన్ని నేర్పిస్తుంది, ముప్పాళ్ళ గ్రామ ప్రజలందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుంది, వారికి ప్రభుత్వం నుండి రావలసినటువంటి సంక్షేమ పథకాలు వచ్చే విధంగా అధికారులుతోటి జనసేన పార్టీ పోరాటం చేస్తుంది, సోమవారం రోజున ముప్పాళ్ళ గ్రామ ప్రజల సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముప్పాళ్ళ గ్రామంలో పర్యటించిన వారిలో పిల్లిపోగు పీటర్, దొరడ్ల సుబ్రహ్మణ్యం నాయుడు, మహబూబ్ బాషా, ప్రసాద్, తిరుమలరెడ్డి, పెయ్యాల రవి, శ్రీను మొదలైన జనసేన నాయకులు పాల్గొన్నారు.