జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గు పడాలి: రామదాస్ చౌదరి

మదనపల్లి: జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాల్సిన విషయం అని మదనపల్లి కమ్మవీధి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి అన్నారు. మధ్యప్రదేశ్ లో ఒక వ్యక్తి మీద ఒక ఉన్మాది మూత్ర విసర్జన చేస్తే ఆ రాష్త్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అతని పిలిచి నా పాలనలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అని అతని కాళ్ళు కడిగి క్షమించమని అడగటం ఎంతో ఔన్నత్యానికి నిదర్శనం అని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి తలకాయలో గుజ్జు తప్ప మెదడు లేదు. కనీసం పక్క రాష్ట్రల ముఖ్యమంత్రిలను చూసి నేర్చుకోవాలి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక దళితుడు పైన నలుగురు సామూహికంగా మూత్రవిసర్జన చేస్తే కనీసం నువ్వు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదని దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. వైసీపీ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా పవన్ కళ్యాణ్ వ్యక్తి గత జీవితంపై విమర్శలు చేస్తున్నారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. మా పవన్ కళ్యాణ్ అణిచిపెట్టి ఉన్నారు కాబట్టి మేము అణిగి మణిగి ఉన్నాం. ఆయన ఒక కనుసైగ చేస్తే జనసేన నాయకులు కానీ, సైనికులు కానీ మీ వ్యక్తి గత జీవితాన్ని రోడ్డు మీదకు తెచ్చి పడేస్తాం అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని చూస్తే బయపడుతున్నాడని స్పష్టంగా కనిపిస్తుందని ఏ సభలో అయినా పవన్ కళ్యణ్ గురించే మాట్లాడుతాడు గాని టీడీపీ గురించి కానీ చంద్రబాబు గురించి కానీ మాట్లాడలేదు. మా నాయకుడు గురించి మాట్లాడుతున్నావ్ అంటే నీకు ప్రస్టేషన్ స్టార్ట్ ఐపోయింది. నీకు భయం స్టార్ట్ అయినది అని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ మాట్లాడితే దానికి సమాధానం చెప్పే చావ లేక మా నాయకుడుని ప్రోసిక్యూట్ చేయమని జీవో జారీ చేస్తావా అని ఇలాంటి జీవోలకు పవన్ కళ్యాణ్ భయపడే రకం కాదని ఈ సందర్భంగా తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ సనాఉల్లా, మదనపల్లి రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, రామసముద్రం మండల అధ్యక్షులు చంద్ర శేఖర్, రామసముద్రం మండలం వైస్ ప్రెసిడెంట్ గడ్డం లక్షిపతి, కుమార్, నాగవేణి, లవన్న, జనార్దన్, శేఖర, నవాజ్, ధనుష్, అక్షయ్, సుహైల్ తదితరులు పాల్గొన్నారు.