మహాపాదయాత్ర కు బ్రహ్మరథం పట్టి బత్తుల వెంకటలక్ష్మి కి అఖండ స్వాగతం పలికిన గ్రామ ప్రజలు

  • రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి, జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలపరచడానికి జనసైనికులు నిరంతరం కృషి చేయాలి – బత్తుల
  • 61 వ రోజు జనం కోసం జనసేన మహాపాదయాత్ర కు బ్రహ్మరథం పట్టిన ఇనుగంటివారిపేట ప్రజానీకం
  • అడుగడుగునా జననీరాజనాల తో, జనసైనికుల కేరింతలతో అత్యంత ఉత్సాహంగా కొనసాగిన మహాపాదయాత్ర
  • సీతానగరం మండలం, ఇనుగంటివారిపేట లో జరిగిన మహాపాదయాత్ర కు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముందుగా రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి కి ఇనుగంటివారిపేట గ్రామస్తులు అఖండ స్వాగతం పలికారు.
  • ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ, ప్రతీ గడప ఎక్కుతూ, గ్రామస్తులతో మమేకమవుతూ, ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ జనసేన పార్టీకి ఈసారి తప్పనిసరిగా ఒక అవకాశం ఇచ్చి పవన్ కళ్యాణ్ లాంటి నిబద్ధత కలిగిన ప్రజానాయకుడిని ముఖ్యమంత్రి చేయాలని, అప్పుడే రాష్ట్రం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండి, భావితరాల భవిష్యత్తుకి మంచి జరుగుతుందని జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు వివరిస్తూ, ఈ అరాచక, దుర్మార్గపు, రాక్షస పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందని, రాష్ట్రం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ తరుణంలో జనశ్రేణులు పార్టీని క్రమశిక్షణతో బలపరచడానికి ప్రతి ఒక్కరు విశేషంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు
  • కార్యక్రమంలో కొండాటి సత్యనారాయణ, వరద ప్రభాకర్ రావు, కొండాటి అనిల్ కుమార్, చిక్కాల నాగ దేవి వరప్రసాద్ (సన్నీ), కొండాటి సత్య, దార్ల బ్రహ్మమ్, వరద వంశీ, మణికంఠ పి ఎల్ ఎం, వర్రే ఈశ్వర్, కొండేటి భద్ర, పెంటపాటి శివ, ఈలి సురేష్, దాసరి వీరబాబు, జయవరపు రాజు, జయవరపు నరసింహామూర్తి, కొలపెల్లి సాయి, చోంగా దుర్గా ప్రసాద్, రాజేష్ సత్యం, దుళ్ల అనిల్ కుమార్, దుళ్ల రామ్ సాయి, ఆకుల మణికంఠ, కొండటి తిలకబాబు, దార్ల దుర్గా ప్రసాద్, సత్యం రాజేష్, సత్యం సతీష్, జయవరపు నితిన్, వరద తరుణ్, దుళ్ల విజయ్‌కుమార్, కైరామ్ శంకర్, బాసు సాయి, బండారు నాగేంద్రబాబు, నల్ల వీరపండు మరియు నియోజకవర్గ సీనియర్ నాయకులు, సీతానగరం మండల జనసేన నేతలు, ఇనుగంటి వారి పేట గ్రామప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు…!!.