వంగర మండల జనసైనికుల ఆత్మీయ సమావేశం

రాజాం, గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వంగర మండల జనసైనికులు, కార్యకర్తలు మండలంలో జనసేన పార్టీ బలోపేతం కోసం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా తేది 25-01-2022 న, మంగళవారం నాడు మడ్డువలస డ్యామ్ దరి సరసనాపల్లి ఊరి తోట వద్ద ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వంగర మండలంలో వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, జనసైనికులు హాజరు అయ్యారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ ఆత్మీయ సమావేశంలో ప్రతీ ఒక్క కార్యకర్త, జనసైనికుడు ప్రస్తుత పార్టీ స్థితి గతులు పై వారి వారి అభిప్రాయాలు తెలియచేసారు. అందరి అభిప్రాయాలు, సూచనలు విన్న తర్వాత పార్టీ శ్రేణులు వంగర మండలంలో పార్టీని బలోపేతం చేయడం కోసం భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకొని ఏకాభిప్రాయానికి వచ్చారు. మండలంలోని ప్రతీ గ్రామంలో ప్రజా సమస్యలు పై పరిష్కార దిశగా పోరాటం చేసి పార్టీని బలోపేతం చేయాలని, రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడటమే లక్ష్యంగా పెట్టుకొని ఎటువంటి గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా అందరూ ఐకమత్యంగా పని చేయాలని నిర్ణయించారు. ఇదే స్ఫూర్తితో పార్టీ బలోపేతం దిశగా భవిష్యత్తులో ప్రతీ గ్రామంలో మరిన్ని కార్యక్రమాలను చేయాలని పిలుపునిచ్చారు. చివరిగా “పవన్ రావాలి – పాలన మారాలి” అనే నినాదంతో సమావేశాన్ని ముగించారు.