పూతలపట్టు జనసేన ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు

పూతలపట్టు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు కార్యక్రమాన్ని, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ సూచనతో పూతలపట్టు నియోజకవర్గంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, ఐరాల మండల నాయకులు పురుషోత్తం, శీను, వాసు, తులసి, మోహన్, దినేష్, సురేష్ కలసి మండలంలోని వేదగిరి వారిపల్లి, మొరంపల్లి మరియు 35 ఎల్లంపల్లి పంచాయతీలోని ఇళ్లను సందర్శించారు. పంచాయతీలోని పాడుపడ్డ ప్రదేశాలను, గుట్టలను సదరించి ఇల్లు మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. కులాల వారిగా విభజించి రోడ్డు పక్కన అగ్రవర్ణాలకు నివాసయోగ్యం కాని భూములను మిగతా కులాల వారికి అందించినట్టుగా తెలుస్తుంది. ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకను ట్రాక్టర్కు మూడు వేల రూపాయల వరకు వసూలు చేసినట్టు తెలుస్తుంది. బిల్డింగ్ కట్టుకోవడానికి కావలసినటువంటి పరికరాలు తక్కువ రేటుకి అందించకుండా ఇల్లు నిర్మాణ వ్యయం పెరిగినట్లు తెలుస్తుంది. ఇల్లు గుణాతానికి దాదాపుగా లక్ష రూపాయలు అయినట్టుగా చెబుతున్నారు, పూర్తిగా ఇల్లు కట్టుకోవడానికి 500000 పైన అయ్యేలాగా ఉందని ప్రజలు తెలియజేశారు. అలాగే ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం యొక్క ఎన్నికలుకు, స్థానిక నాయకులకు సహకరిస్తేనే ఇల్లు కేటాయించినట్లు తెలుస్తుంది. స్మశానాల పక్కన, డంపింగ్ యార్డ్స్ పక్కన ఇల్లు స్థలాలు కేటాయించి మొక్కుబడుగా పథకం అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది. పేదల పశువులకు కానీ, గొర్రెలకు కానీ తన ఇంటి వద్ద ఉంచుకోవడానికి తగిన స్థలాన్ని కేటాయించడం లేదు. మురికి కాలువలు డ్రైనేజీ వ్యవస్థ శూన్యం. ప్రభుత్వ అధికారులు సమస్యలను పరిశీలించి ప్రజలకు న్యాయం చేయాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం.