ధాన్యం రైతులు, ఉద్యాన పంటల రైతుల పై నీళ్లు చల్లిన అసలీ తుఫాన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రం మొత్తం మీద ఈ ఏడాది 18.5 రబీ పంటగా వరి సాగు చేశారు.. ప్ప్రభుత్వం నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి కోనసీమ, కృష్ణా, వల్లూరు, నెల్లూరు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వరి దెబ్బతింది. వర్షం కొనసాగుతుండటంతో పట్టాలతో కప్పి వర్షం తగ్గాక ధాన్యాన్ని ఆరబెట్టేందుకు, మళ్లీ వర్షం వస్తే పిట్టలు కప్పేందుకు కూలీలు, పట్టాల ఖర్చులకు రోజుకి 1500 నుండి 2000 రూపాయలు అవుతోందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎకరా వరి సాగుకు 40 వేల వరకు అవుతుండగా అదనంగా ఖర్చు 10 నుండి 29 వేల వరకు అవుతోందని రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.

అదేవిధంగా 80 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు కూడా నష్టం జరిగింది. తుఫాన్ మరియు ఈదురు గాలులకు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 50 వేల ఎకరాలకు పైగా ఉద్యాన పంటలు, కూరగాయల పంటలు పాడయ్యాయని నష్టం శాతం 33 పైగా అంచనా. సుమారు 400 కోట్ల వరకు రైతులు కోల్పోయారు. పంట చేతికొచ్చే దశలో తుఫాను రైతులపై విరుచుకుపడింది. ప్రభుత్వం రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత డిమాండ్ చేశారు.