అమలాపురం పట్టణ సీఐ బాజిలాల్ వి ఆర్ ఆపాలి

కోనసీమ జిల్లా, అమలాపురం పట్టణ సిఐ బాజిలాల్ ని అకస్మాత్తుగా వి ఆర్ కి పంపడం చాలా దుర్మార్గమైన చర్య అని అమలాపురం రూరల్ చిందాడ గరువు జనసేన ఎంపిటిసి మోటూరి కనకదుర్గ, ఆమె భర్త వెంకటేశ్వరావు అన్నారు. బాజిలాల్ విధి నిర్వహణలో నీతి నిజాయితీగా ముక్కుసూటిగా, ధర్మం, న్యాయం కాపాడుతూ బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆయనపై తీసుకున్న చర్యలపై జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని జనసేన ఎంపిటిసి మోటూరి కనకదుర్గ, వెంకటేశ్వరావు తెలిపారు.