జనసేన ప్రభంజనం ఖాయం

  • నెల్లూరు నగర జనసేన అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు

నెల్లూరు నియోజకవర్గం: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన విజయం ఖాయమని నెల్లూరు నగర జనసేన అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని 42వ డివిజన్ మనం సిద్ది నగర్ లో జనసేన జనం కోసం గడపగడపకు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుజయ్ బాబు మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రజలపై అనేక విధాలుగా మోయలేని భారాలను మోపుతున్నారని, పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కంతర్, అజయ్, శ్రీకాంత్, అలేక్, అనుదీప్, కరీం, తస్మల్, వీరమహిళలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.