హస్పటల్ కి రోడ్డేది..? సూటిగా ప్రశ్నించిన జనసేన నాయకులు

కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం జగ్గంపేట గ్రామంలో రోడ్డు మార్గం లేకపోవడం, సమయానికి చికిత్సకి చేరుకోపోవడంతో నిండుప్రాణాం పోయిన సంఘటన చోటు చేసుకుంది.. ఈ సంఘట పై జనసేన మండలం ప్రెసిడెంట్ అమరాదివల్లి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. వైద్యం అందకప్రాణాలు పోగొట్టుకునే వారిని చూసాము డబ్బులు లేక వైద్యం చేయించుకోలేని వారిని చూసాము, కాని రోడ్డులేక ప్రాణాలు పోగొట్టుకొనేవారిని జగ్గంపేటలో చూస్తున్నాము అదేంటి అనుకుంటున్నారా మీరు విన్నది నిజం చిన్న జగ్గంపేట గ్రామంలో సత్యనారాయణ అనేవ్యక్తి అనారోగ్యానికి గురై ప్రాణాయామస్థితిలో కొట్టుమిట్టాడుతుంటే.. గ్రామస్తులు అంబులెన్స్ కు పోన్ చేసారు, అంబులెన్స్ అయితే అనుకున్న టైంకి వచ్చింది గాని, బాదితుని ఇంటికి అంబులెన్స్ వెళ్ళే మార్గం లేక గ్రామంలోనే ఐదు వందల మీటర్ల దూరంలో ఉండిపోవడంతో గ్రామంవారు పేషెంట్ ని భుజాలమీద అతికష్టం మీద అంబులెన్స్ దగ్గర కు తీసుకొచ్చే సరికి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చూసారా రోడ్లు లేక సమయానికి చికిత్సకి చేరుకోపోవడంతో నిండుప్రాణాం పోగొట్టుకున్నట్టు అయింది. ఈ సంఘట మీద జనసేన పార్టీ మండలం ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సరైన రోడ్లు నిర్మించక చాలా మంది ఇలాగే సమాయానికి వైద్యం అందక ప్రాణాలు పొగొట్టుకుంటున్నారని, చిన్న జగ్గంపేటలో అధికార పార్టీ సర్పంచ్, ఎంపిటీసి ఉన్నారు గానీ ఆ బాదితుడి ఇంటికెళ్ళే రోడ్డు మార్గం వేయించలేక పోయారని, ఓట్లు వేసి అధికారం ఇచ్చిన పాపానికి ఇలా ప్రాణాలు బలిగొంటున్నారని, ప్రజలకు సౌకర్యాలు కలిగించలేని పదవు లు ఉన్నా, లేకున్నా ఒకటేనని నిప్పులు చెరిగారు. తక్షణమే చనిపోయిన సత్యనారాయణ కుటుంబానికి పదిలక్షలు నష్టపరిహారం ఇవ్వాలి.. లేదంటే ఎంతకష్టమైనా ఎదుర్కొని బాదితుడికి నష్టపరిహారం అందేవరకు పోరాడతామని నిప్పులు చెరిగారు. జనసేన తరపున సత్యనారాయణ కుటుంబానికి పదిలక్షలు నష్టపరిహారం ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేసారు.