నెల్లూరు రూరల్ జనసేన ఆధ్వర్యములో రక్తదాన శిబిరం

నెల్లూరు: నెల్లూరు రూరల్, 33 వ డివిజన్, వెంగళరావు నగర్ లో గతంలో జనసేన పార్టీకి క్రియాశీలకంగా పని చేసిన ఆరవ విజయ్ కాంత్ మొదటి జయంతి సందర్భంగా స్థానికంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. జనసైనికులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా దృక్పథంతో చేసిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు ఎంతో అభినందించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గునుకుల కిషోర్ మాట్లాడుతూ జనసేన పార్టీ నాకేం ఇచ్చిందని ఎవరైనా అడిగితే అంతులేని అభిమానం పంచే తమ్ముళ్లనిచ్చిందని చెప్పుకుంటాను. తోడబుట్టిన వాళ్ళిద్దరైతే తోడు నడిచే వాళ్ళు ఎంతమందో లెక్క కూడా పెట్టలేకున్నానని తెలిపారు. ఇంతమంది అభిమానించే తమ్ముళ్ళను ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఆశయ సాధనకు వారదిగా వ్యవహరిస్తున్నాని, నా వెనుక నడిచే తమ్ముళ్ల అందరికీ మార్గదర్శకంగా నడుచుకుంటానని తెలిపారు. అరవ విజయ్ కర్ర సాము వంటి కళలలో ప్రావీణ్యం గల సోదరుడు తక్కువ వయసులోనే మాకు దూరం కావడం నిజంగా దురదృష్టమని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ సోదరుని స్మృతి నివాళులర్పిస్తూ జనసేన పార్టీ తరపున చిన్న రాజా బ్లడ్ క్యాంప్ ఆరంబించి దాదాపు 50 యూనిట్ల రక్తాన్ని అందించడం అభినందనీయమని తెలిపారు. విజయ్ కాంత్ గతంలో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనే వారిని నెల్లూరు రూరల్ లో జనసేనకి గట్టిగా పట్టున్న ప్రాంతం 33 వ డివిజన్ అనీ రానున్న రోజుల్లో జనసేన పార్టీకి పట్టం కట్టే విధంగా అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్, వినోద్, జాన్ పాల్, ఉద్దేష్, మిధున్, కంథర్, అమీన్, అలేఖ్, ఖలీల్, ప్రసన్న, ఇంతియాజ్, షాజహాన్, హేమంత్ యాదవ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.