సీఎం వెంకటగిరి పర్యటన నేపథ్యంలో కోటా దంపతుల హౌస్ అరెస్ట్

శ్రీకాళహస్తి నియోజకవర్గం: సీఎం వెంకటగిరి పర్యటన నేపధ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా, భర్త కోటా చంద్రబాబు లను శ్రీకాళహస్తి పోలీసులు హౌస్ అరెస్టు చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇదేం ప్రజాస్వామ్యం! జనసేన పార్టీ అంటే అడుగడుగునా ఇంత భయమా అని ప్రశ్నిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని దుయ్యబట్టారు. ప్రభుత్వ పోకడ ఇలాగే కొనసాగితే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు.