సామాన్యులపై అధికార వైసీపీ ప్రభుత్వం పగబట్టింది: దారం అనిత

చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యాదర్శి దారం అనిత మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారిని ఈ ప్రభుత్వం పీల్చి పిప్పిచేస్తుంది. పేద వారికి సామాన్యులకు ప్రయాణ అవసరాలు తీర్చే ఆర్టీసీ బస్ ఛార్జీలను మూడు నెలల్లో రెండు సార్లు పెంచి పేద వారి ప్రయాణాన్ని ప్రభుత్వం మరింత భారం చేస్తుంది. డీజిల్ సేస్ పేరుతో పల్లె వెలుగు నుండి ఏసీ సర్వీసు లన్నిటి మీద ఈ ప్రభుత్వం రేట్లు పెంచేసింది. బల్క్ లో రిటైల్ లో డీజిల్ కొంటున్నాం అని ఆర్టీసీ ఎండీ చెప్తున్నారు. బయట పెట్రోల్ బంక్ లలో రూ.99.45 పై ఉండగా ఆర్టీసీ మాత్రం రూ.131 పెట్టి డీజిల్ కొంటున్నాం, అందువల్లే టికెట్ ఛార్జీలు పెంచుతున్నాం అని ప్రజలను మభ్యపెడుతున్నారు. పథకాలు, సంక్షేమం మాటున ఈ ప్రభుత్వం సామాన్య ప్రజల నుండి పన్నులు, సేస్ ల రూపంలో దోచేస్తున్నారు. పెంచిన ఆర్టీసీ చార్జీలు సత్వరమే తగ్గించాలని జనసేన పార్టీ తరఫున చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యాదర్శి దారం అనిత డిమాండ్ చేశారు.