పోలీసుల త్యాగాలు అజరామరం

  • క్షణం కూడా విశ్రాంతి ఎరుగని విధి నిర్వహణ పోలీసులది
  • పోలీసుల కుటుంబ సభ్యులకు యావత్ ప్రజానీకం ఋణపడివుంటుంది
  • పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడే క్రమంలో తమ ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి పోరాడే పోలీసుల త్యాగాలు అజరామరమని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నగరంపాలెం వద్దనున్న అమరవీరుల స్తూపం వద్ద విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులకు ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోలీసుల సేవలను ఆయన కొనియాడారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎలాంటి ఆపద కలిగినా దేవుడి కన్నా ముందు గుర్తుకువచ్చేది పోలిసేనన్నారు. పోలీస్ వ్యవస్థను ఏ వ్యవస్థతోనూ పోల్చలేమని, ఎలాంటి ఉద్యోగంలోనైనా విశ్రాంతి, విరామం ఉంటుందని ఒక్క పోలీసు మాత్రమే క్షణం కూడా తీరిక లేకుండా విధులు నిర్వహిస్తాడన్నారు. విధి నిర్వహణలో పోలీసులకు కొండంత అండగా ఉంటూ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే వారి కుటుంబ సభ్యులకు యావత్ ప్రజానీకం రుణపడి ఉంటుందని నేరేళ్ళ సురేష్ అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ప్రధాన కార్యదర్శి కటకంశెట్టి విజయలక్ష్మి, రెల్లి యువనేత సోమి ఉదయ్ కుమార్, గుర్రాల ఉమ, పులిగడ్డ గోపి, వడ్డె సుబ్బారావు, దళవాయి సుబ్రహ్మణ్యం, మల్లి తదితరులు పాల్గొన్నారు.