ధర్మపురిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వనమోదు శిబిరాన్ని నిర్వహించిన నాయకులు బెల్లాన గౌరి

విజయనగరం, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాన్ని విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి పిలుపు మేరకు, 31వ డివిజన్లో, ధర్మపురిలో జనసేన పార్టీ నాయకులు బెల్లాన గౌరి నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు గౌరి మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరానికి మంచి విశేష స్పందన లభించిందని, సభ్యత్వంతో పాటు జీవితభీమా సౌకర్యాన్ని జనసేన కార్యకర్తలందరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు), రవిరాజ్ చౌదరి, రాజారావు, నామాల దుర్గారావు, సాయికుమార్, డి.చిరంజీవి, కె.వాసు, ప్రసాద్ పాల్గొన్నారు.