ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి జనసేన జెండా ఎగురవేయనున్న జనసైనికులు

ఎల్ బి నగర్, జనసేన పార్టీ రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని మరియు తెలంగాణా రాష్ట్రంలో కూడా మెరుగైన ఫలితాలు సాధించి జనసైనికులు శాసన సభ్యులుగా శాసనసభలో ప్రాతినిధ్యం వహించాలని మంచి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం, రాజుపాలెం మండలం, గణపవరం గ్రామ జనసేన పార్టీ కార్యకర్తలు చందు కుంభా, వాసు పోట్లూరి, రవీంద్ర చేపూరి కలిసి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి శిఖరంపై జనసేన పార్టీ జెండా ఎగురవేసే కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేస్తూ బుధవారం మధ్యాహ్నం 3.00 గంటలకు వెంకట సాయి ప్రసాద్ కోటిపల్లి ఆహ్వానం మేరకు ఎల్ బి నగర్ నియోజకవర్గం, దిల్ సుఖ్ నగర్ జనసేన పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం మరియ ఉపాధ్యక్షులు వెంకటా చారిల ఆశీస్సులతో యమ్ యస్ ఆర్, చందన చక్రవర్తి పట్టెల‌‌‌, గౌరి నాయుడుల సహృదయంతో పాదయాత్ర చేస్తున్న జనసైనికులకు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమమునకు హాజరై విజయవంతం చేసిన జనసైనికులకు 50 మందికి ఎల్ బి నగర్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు వెంకట సాయి ప్రసాద్ కోటిపల్లి విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి మంచి సహకార్యానికి వెంకట సాయి ప్రసాద్ కోటిపల్లి ఎప్పుడూ ముందు ఉండి జరిపిస్తారని తెలుపుతూ విచ్ఛేసిన మురళీధర్ రావు, చక్రవర్తి, గౌరి నాయుడు, నాగేష్, శ్రీమతి వెంకటలక్ష్మీ, అశోక్, ఓం సాయి కిరణ్, రాజు శంకర్, రవి చందు, రవీంద్ర, మరియు జనసేన పార్టీ అన్ని విభాగాల శ్రేణులు హాజరై వారికి సంఘీభావం తెలిపి, ఆశీర్వదించి జనసైనికుల పాదయాత్ర దిగ్విజయంగా జరిగి వారి సంకల్పం సిధ్ధించి జనసేన పార్టీ జెండా ఎవరెస్టు శిఖరంపై ఎగురవేసి జనసేన పార్టీ ఔన్నత్యాన్ని చాటాలని, జాతీయ జెండాను ఎగురవేయాలని వారి పాదయాత్ర సాగే రహదారి జనసైనికులు అండగా ఉండాలని కోరుకుంటూ వారికి శుభాశీస్సులు, దీవెనలు అందించి పాదయాత్రలో సంఘీభావం తెలిపి అనుసరించిన ప్రతి జనసైనికులు, వీరమహిళలకు సాధారణ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తన సహకారంతో విజయవంతం చేసిన చక్రవర్తి పట్టెల‌‌‌కి ధన్యవాదములు యాత్ర సంపూర్ణ మయి వారు ఆరోగ్యంగా తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుచున్నామని తెలిపారు.