వరద బాధితుల బాధలు వర్ణనాతీతం

పి. గన్నవరం నియోజకవర్గం: మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో వరద బాధితులు తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. గ్రామంలోని అగ్నికుల క్షత్రియులు బాధ వర్ణనాతీతం ఒక ఇంటిలో ఆరుగురు ఉన్నప్పటికీ ఒకే ఒక ఆహార పొట్లం ఇవ్వడం జరిగిందని వాపోయారు. ఆహారం లేక నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనితో అప్పనపల్లి గ్రామ జనసేన సైనికులతో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకొని వెంటనే సంబంధిత స్పెషల్ ఆఫీసర్ గారిని కలిసి చర్యలు తీసుకోవలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ మేడేపల్లి సత్యనారాయణ తుల ఉమా కంకిపాటి నాని, రవణఒ సాయి, అంజి, తినాతి శ్రీనివాస్, మండల కార్యదర్శులు మేడేపల్లి సత్య, కాట్రెనిపాడు నాగేంద్ర తదితర జనసేన సైనికులు పాల్గొన్నారు.