ఆర్టిషన్ విషయంలో మాకు అన్యాయం జరిగింది: దేవా గౌడ్

తెలంగాణ, ఆశ్వారావు పేట, కేటీపీఎస్ నందు హయర్ వెహికల్ డ్రైవర్లుగా గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2016 అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు కేటీపీఎస్ కర్మాగారంలో ఎవరైతే కార్మికులు విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ ఆర్టిషన్ గా గుర్తించడం జరిగింది. ఆ ప్రక్రియలో హయ్యర్ వెహికల్ డ్రైవర్స్ అయిన మాకు కేటిపిఎస్ యాజమాన్యం అన్యాయం చేసింది. ఆర్టిషన్లుగా గుర్తించడానికి యాజమాన్యం ఏవైతే విధివిధానాలను అర్హతలను రూపొందించిందో అటువంటి అన్ని అర్హతలను (గేట్ పాస్, ఈపిఎఫ్, అగ్రిమెంట్, ఏన్యువల్ మెయింటెనెన్స్) అన్ని మేము కలిగి ఉన్నాము. ఇలా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఈరోజు వరకు కేటీపీఎస్ యాజమాన్యం మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయానికి గురిచేస్తుంది. ఈ విషయమై ఇప్పటివరకు గౌరవ యాజమాన్యానికి గౌరవ ప్రజాప్రతినిధులను ఎంతమందిని కలిసిన మాకు న్యాయం జరగలేదు. కావున మా యొక్క బాధని మీడియా మిత్రుల ద్వారా యాజమాన్యానికి ప్రభుత్వానికి తెలియజేయాలి అనుకుంటున్నాము. కారు గుర్తు పెట్టుకున్న బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీపీఎస్ లో గత 11 సంవత్సరాల నుండి కార్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాము ఆర్టిషన్ విషయంలో మాకు అన్యాయం జరిగిందని జనసేన నాయకులు దేవా గౌడ్ సురేందర్ అన్నారు.