మూడవ విడత పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా

నాగర్ కర్నూల్ నియోజకవర్గం, పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా పాదయాత్ర మూడవ విడత తిమ్మాజిపెట మండలం అప్పాజీపల్లి గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులతో, జనసైనికులతో కలిసి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ 10 సంవత్సరాల టి.అర్.ఎస్ పాలనలో బాగుపడింది కల్వకుంట్ల కుటుంబం తప్ప మధ్య తరగతి కుటుంబాల జీవితాలు ఏమి బాగుపడలేదు. ఇంటికొక ఉద్యోగం, డబల్ బెడ్ రూమూలు, దళిత బంధు, రైతు బంధు ఇలా సంక్షేమ పథకాలు అంటూ మాయ మాటలతో ప్రజలను మభ్య పెడుతూ టి.అర్.ఎస్, బి.అర్.ఎస్ గా అభివృద్ధి చెందింది తప్ప తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది అనేది కేవలం మాటలకే. దీన్ని బలంగా ఎదురుకోవడనికి మీ ఇంటి బిడ్డగా నా ఇంటి గడప దాటి మీ ముందుకు వచ్చిన మన బహుజన బిడ్డను మన రాజ్యాధికారం మనం సాధించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో వంగ విజయ్ భాస్కర్ గౌడ్, సూర్య, వంశీ రెడ్డి, ఎడ్ల ప్రసాద్, పవన్, పూస శివ, నరసింహ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.