దసరా నుండి జనసేన దండయాత్ర

  • దసరా తర్వాత జగన్ కు సినిమా చూపిస్తానన్న జనసేనాని.

మదనపల్లె, యువతకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం దక్కాలంటే ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు. కానీ ఎన్ని కేసులు ఉన్నా నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎలా ఎన్నికవుతారు. నేతలకు ఒక రూల్, యువతకు ఒక రూల్ ఒకసారి గెలిస్తే ఐదేళ్ల పాటు ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో గెలిచిన నాయకులు వుంటున్నారు సరిగ్గా పని చేయకపోతే రెండేళ్ల తర్వాత రీకాల్ చేసే చట్టం తేవాలి. డిగ్రీ అయ్యాక యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోంది .కానీ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ లేదు దీని ప్రశ్నించడం తప్పా ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం ఇబ్బందులపాలు చేయడం ఈ ప్రభుత్వానికి పది పాటిగా మారింది. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవాలి. అధికారంలోకి వస్తే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని 2,50,000 ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వాటిపై ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగ యువతకు 10 లక్షల చొప్పున ఇస్తే పదిమందికి స్వయం ఉపాధి దక్కుతుందని, జనసేన అధికారంలోకి వస్తే తప్పనిసరిగా 2,50,000 ఖాళీలను భర్తీ చేస్తామని జనసేన అధ్యక్షులు నిన్నటి పర్చూరు సభలో చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడి అధ్యక్షులవారు నష్టపోయారు ప్రధాని మోడీ అంటే తనకెంతో ఇష్టమైనా ఈ విషయంలో మోడీతో విభేదించారు. అయినా ఎప్పుడూ బాధపడలేదు. తెలుగు ప్రజలకు మాత్రమే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజల దత్తపుత్రుడు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాటిని ఎదుర్కొని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపక పోయినా ప్రజలకు అండగా నిలబడ్డారు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకొని తన వంతు సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు. ఇది గమనించి 2024లో జనసేనకు అధికారం ఒకసారి ఇవ్వాల్సిందిగా చేతులెత్తి వేడుకుంటున్నానని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు.