రెడ్డిగూడెంలో మూడోవిడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం

రెడ్డిగూడెం మండలం, రెడ్డిగూడెంలో జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు(గాంధీ) క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రెడ్డిగూడెంలో ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా రెడ్డిగూడెంలోని ప్రజలకు అవగాహన కొరకు సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుని, మీ కుటుంబానికి భరోసాని కల్పించుకోవాలంన్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 10వ తారీకు నుండి 28వ తారీకు వరకు జరుగుతుందని, అందరూ సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన కార్యకర్తల కోసం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కార్యక్రమం జనసేన క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం. ఈ సభ్యత్వం పొందిన వారికి ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే పార్టీ నుండి ఐదు లక్షల రూపాయలు తన కుటుంబ సభ్యులకు అందిస్తుంది. ఒకవేళ గాయపడి హాస్పిటల్ లో జాయిన్ అయితే ఖర్చుల నిమిత్తం యాభై వేల రూపాయలు అందిస్తుంది. ఈ క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం ఇప్పటికే రెండు సంవత్సరాలు విజయవంతంగా సాగింది. గత సంవత్సరంలో మరణించిన క్రియాశీల కార్యకర్తలు 96 మందికి ప్రమాద బీమా కింద నాలుగుకోట్ల, ఎనభై లక్షల రూపాయలు అందించారు. ఒకరికి అయిదు లక్షల చొప్పున, ప్రమాదవసాత్తు గాయపడిన 169 మంది కార్యకర్తలకు అరవై లక్షల, తొంబై వేల రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల అధ్యక్షుడు చాపలమడుగు కాంతారావు, ఉపాధ్యక్షులు పాములపాటి సుందరరామిరెడ్డి, బొల్లిపోగు చంటి, మైలవరం మండల అధ్యక్షుడు శీలం బ్రహ్మయ్య, మండల కమిటీ సభ్యులు, శివ, దుర్గాప్రసాద్, రమేష్, పి.రమేష్, అనంత్ కుమార్, రామకృష్ణ, గురు ప్రియతం, సాయి, సురేష్ ఇంకా జనసైనికులు పాల్గొన్నారు.