ఘనంగా వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ

ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం అనుమలపల్లె గ్రామంలో వంగవీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటగా కంభం సెంటర్ నుండి 20 కిలోమీటర్ల మేర భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాచర్ల మండలం, అనుములపల్లి జంక్షన్ లో ఏర్పాటుచేసిన స్వర్గీయ వంగవీటి రంగా విగ్రహావిష్కరణలో కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆమంచి స్వాములు పాల్గొనడం జరిగింది. మొదటిగా కంభం సెంటర్లో కాపు సంఘీయులు, జనసైనికులు వారికి ఘనస్వాగతం పలకడం జరిగింది. అనంతరం గిద్దలూరులో బలిజ సంఘం భవన్ లో జరిగిన ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేసి, ముఖ్య తిధిగా విచ్చేసిన ఆమంచి స్వాములు కాపు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు జే.ఏ.సి నాయకులు దాసరి రాము, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ నాయకులు వరికూటి నాగరాజు, గిద్దలూరు జనసేన పార్టీ ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు, జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య, ఉదయగిరి మల్లికార్జున, కంభం మండలం అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్, సందు నారాయణ, సురే ప్రసాద్, వీరణాల గోపాల్, ఇళ్ళూరి అనిల్, దేవారాజ్, శ్రీపతి కృష్ణయ్య, బండి రంగయ్య, బండి ఆంజనేయులు, తిరుమలశెట్టి వెంకటరావు, అలిశెట్టి వెంకటేశ్వర్లు, సిద్ధం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొనడం జరిగింది.