రానున్న ఎన్నికలు గిరిజనజాతికి గిరిజనద్రోహులకు మధ్య జరిగే యుద్ధం

  • జనసేన పార్టీ పాడేరు ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య

పాడేరు: జి.మాడుగుల మండలం, వంజరి పంచాయితీ గొందిమెలక గ్రామంలో జనసేన పార్టీ నాయకులు పాడేరు జనసేనపార్టీ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య మరియు చింతపల్లి, జి.మాడుగుల మండల నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డా. గంగులయ్య మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు గిరిజన జాతికి గిరిజన ద్రోహులకు మధ్య జరిగే యుద్ధం వంటిదన్నారు. అనేక పర్యాయలుగా దగాపడుతున్న గిరిజనులు ఈ సారైన జాతి మనుగడకోసం నిజమైన పోరాట దృక్పధంతో ఉన్న నాయకులను ఎన్నుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజాప్రతినిధుల తెలివి ఎటువంటిదంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గిరిజనజాతికి ముప్పు తెచ్చే చీకటి తీర్మానాలు గిరిజన హక్కులు, చట్టాలు నిర్వీర్యం అవుతుంటే కళ్ళకిలించి చూస్తూ వుంటారు ఎన్నికలు వస్తుంటే మేము అధికారంలోకి వస్తే అధిచేస్తాం ఇదిచేస్తామంటూ ఉత్త ప్రగల్బాలు డంకబజాయించి చెప్తారు. అసలు ప్రస్తుతమున్న ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, మత్స్యరాస విశేశ్వర్రాజు ఇంకోసారి ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడుందని ఘాటు విమర్శలు చేసారు. వీళ్ళకి గిరిజన అస్తిత్వం రాజకీయంగా వాడుకోబడే అంశమైపోవడం ఏమిటో వీరి రాజనీతిజ్ఞత గిరిజనప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారన్నారు. సంయుక్త కార్యదర్శి కిల్లో రాజన్ మాట్లాడుతూ గిరిజన ద్రోహులు వైసీపీ నేతలు ప్రతి గ్రామానికి ప్రచారనికొస్తే యువకులు నిలువునా వారి ద్రోహపు విధానాలపై కడిగేయ్యాలన్నారు అలాగే ఇంకెన్నాళ్లు ఇలా గిరిజన జాతి ప్రజలను మీ రాజకీయధికారం కోసం నీతిమాలిన పనులు చేస్తారని ప్రశ్నించాలన్నారు.జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేనపార్టీ కచ్చితంగా పాడేరు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఓటమి అంగీకరించడానికి గిరిజన ద్రోహులు సిద్ధం కావాలన్నారు వైసీపీ కన్నీబాలిజం రాజకీయాలకు త్వరలోనే గిరిజన ప్రజలు ముగింపు పలుకుతారన్నారు అనంతరం గొందిమెలక గ్రామ యువత, గ్రామస్తులు స్థానిక నాయకులు పరశురామ్, సుబ్బారావు జనసేనపార్టీ ఇన్చార్జ్ గారి ఆధ్వర్యంలో జనసేనపార్టీ లో చేరారు వారికి సాదరంగా పార్టీ కండువాలు కప్పి జనసేనపార్టీ లో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కిల్లో రాజన్, జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, భానుప్రసాద్, చింతపల్లి మండల అధ్యక్షులు వంతల బుజ్జిబాబు, ఉపాధ్యక్షులు రాజారావు, రమేష్, బుజ్జిబాబు, స్థానిక గ్రామస్తులు యువత పెద్దఎత్తున పాల్గొన్నారు.