కార్యకర్తల పోరాట ఫలితమే బీజేపీ విజయం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థులతో భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటానని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని పిలుపునిచ్చారు. ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యం సృష్టంగా కనిపించిందని చెప్పారు. సీఎం వ్యవహారశైలికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని.. వారందరికి ధన్యవాదాలు తెలిపారు. గ్రేటర్‌ పరిధిలో ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తానని పేర్కొన్నారు.సర్జికల్ స్ట్రైక్‌ ప్లేస్‌లో సాఫ్రాన్‌ స్ట్రైక్‌ చేశామని తెలిపారు. హైదరాబాద్‌ ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.