జనసేనపార్టీలో చేరిన దేవరపల్లి గ్రామస్తులు

అల్లూరి జిల్లా, జి.మాడుగుల మండలం దేవరపల్లిలో జనసేనపార్టీ నాయకులు సమావేశమవడం జరిగింది. జనసేనపార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చేనెల 02.09.2023 తేదీన ఉన్నందున మారుమూల పల్లెల్లో జనసేనపార్టీ జి.మాడుగుల మండల నాయకులు పర్యటిస్తున్న విషయం విధితమే. ఈ సందర్బంగా దేవరపల్లిలో గ్రామస్తులతో సమావేశమై వారితో జనసేనపార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు గిరిజన ప్రజాసాధికారత విషయమై సర్చించారు. జనసేనపార్టీ అధినేత పుట్టినరోజు నాటికి 100 గిరిజన కుటుంబాలను జనసేనపార్టీలో చేర్చడమే లక్ష్యంగా పాడేరు లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉందో మేము ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం అస్థిరతకు గురౌతున్న గిరిజన పరిస్థితులపై మాత్రమే మాట్లాడదలుచుకున్నాం. నానాటికి ఒకొక్క గిరిజన హక్కులు, చట్టాలు కోల్పోయి రానున్న సమీప భవిష్యత్ లో మరొక మణిపూర్ ని తలపించేలా అధివాసి ప్రాంతాన్ని సృష్టించడమే వైసీపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అందుకు ఈ ప్రాంతపు ప్రజాప్రతినిధులు గిరిజన ఆస్తిత్వంపై ప్రభుత్వం దాడులు చేస్తున్న కూడా వారి మౌనం ఒక ఉదహరణగా చెప్పవచ్చు. ఇక జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ అధికారంలో లేకున్నా కూడా తన వంతు బాధ్యతగా ఎన్నో కుటుంబాలను ఆదుకున్నారు. ఎందరో కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుని తన రాజకీయ పంథా ఏమిటో తెలియజేసారు. ఇప్పటికైనా అదివాసి ప్రజలు గుర్తించి అటువంటి అశయ, లక్ష్యాలు కలిగిన వ్యక్తిని సీఎంగా చేసేందుకు అభ్యుదయ భావాలున్న ఎందరో గిరిజన యువకులు రాత్రి పగలు తేడాలేకుండా నిర్విరామంగా పని చేస్తున్నారని ఈ సందర్బంగా మీకు తెలియజేస్తున్నామని ఇంకా ప్రభుత్వ విధానాలపై ప్రత్యేకంగా మీతో ప్రస్తావించడాలుచుకోవలని లేదని ఇటువంటి రాక్షస పాలన ఇంతకు ముందెన్నడూ చూడలేదని ఈ విషయం ఓటు హక్కు లేని చిన్నపిల్లలకు సైతం తెలుసని కాబట్టి మార్పు కొరకు మీరు కూడా సిద్ధపడి గిరిజన క్షేమాన్ని కాంక్షించాలన్నారు. ఈ సందర్బంగా దేవరపల్లి గ్రామస్తులు పెద్దఎత్తున జనసేనపార్టీలో కిల్లో రాజన్ చేతుల మీదుగా కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. ఈ చేరికలో జి.మాడుగుల మండల నాయకులు మసాడి భీమన్న, ఉల్లి సీతారామ్ చింతపల్లి నాయకులు, కొర్రా భానుప్రసాద్, తాంగుల రమేష్ స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.