సహనం కోల్పోయి అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్న అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు

పాడేరు, కొయ్యురులో అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య జనసేనపార్టీ మండల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఆయన ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇటీవల జి.మాడుగుల మండలంలో గడప గడప మన ప్రభుత్వమనే కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే కొట్టగుల్లీ భాగ్యలక్ష్మికి సొంత పార్టీ వార్డు మెంబర్ తో సూటి ప్రశ్న ఎదురయ్యింది? దీంతో ఖంగుతిన్న ఎమ్మెల్యే పర్సనల్ గా మాట్లాడాలని, మీరు నాకు ఓటు వేసారని గ్యారెంటీ ఏమిటని అనడం ప్రజాస్వామ్య వ్యవస్థని కించపరచడమే అవుతుందని ఎద్దేవా చేశారు. నిజంగానే గిరిజన సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే గిరిజనుల అభివృద్ధి కోరుకుంటే ఆ దిశగా మీరు ఆలోచన చేస్తే మీకు ఇటువంటి సంఘటనలు ఎందుకు ఎదురవుతాయని అన్నారు. గిరిజనుల ఓట్లతో గెలిచిన మీరు పదవులు శాశ్వతమనే భ్రమలో ఉన్నారని అందుకోసం గిరిజన హక్కులు, చట్టాలు చివరికి గిరిజన అస్తిత్వంపై ప్రభుత్వం ప్రత్యక్ష అత్యాచారాలకు పూనుకున్నా కూడా కిమ్మనకుండా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారని, ఇదేనా మీ నాయకత్వ పటిమ అంటూ తీవ్ర విమర్శలు చేసారు. ఈరోజు కేవలం వార్డు మెంబర్ తన ఆవేదన చెప్పుకుంటే విషయం పక్కదోవ పట్టించారు కానీ ముఖ్యమంత్రి ముందు స్వతంత్ర గిరిజన పోరాట పటిమని ఎందుకు వ్యక్తపరచలేకపోయారు. గిరిజన జాతికి బానిసత్వం నూరిపోస్తున్నారా? లేక గిరిజన హక్కులపై మాకెందుకులే మా ప్రోటోకాల్ నిబంధనలతో మేము హాయిగా ఉన్నములే అనుకుంటున్నారా? ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గిరిజన జాతికి సమాధానం చెప్పాలి. ద్రోహం చేసింది చాలక ప్రశ్నించిన సామాన్యులపై దబాయింపు వాఖ్యల్ని గిరిజన ప్రజలు తమను రక్షించే రాజకీయమని అనుకుంటారని మీరు అనుకుంటే అంతకు మించిన పొరపాటు ఇంకొకటి ఉండదు. ఈరోజుకి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా గిరిజన ప్రాంతాల్లో సమస్యలు అనేకమున్నాయి లేదని అంటారా? ఏ మాత్రం గిరిజన సమస్యలపై గిరిజన అభివృద్ధిపై మీకు చిత్తశుద్ధి ఉన్నా జవాబుదారీతనం ఉన్న ప్రజల, ప్రజా సంఘాల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమా? మేము సిద్ధమేనని అరకు, పాడేరు, రంపచోడవరం ఎమ్మెల్యేలు ఎంపీ మా సవాల్ ని స్వీకరించే సత్తా ఉంటే బహిరంగ సర్చకు రావాలని డా.గంగులయ్య వైసీపీ ప్రజాప్రతినిధులని హెచ్చరించారు. గడిచిన నాలుగేళ్ళ కాలంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందో లేదో ప్రజలు కూడా గమనించాల్సిన అవసరముందని అన్నారు. చివరగా టీడీపీ మండల మాజీ అధ్యక్షులు షేక్ బసీర్ ఖాన్ అనారోగ్యంతో ఉన్నారని తెలుసుకుని అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని పరమార్చించారు. ఈ సమావేశంలో కొయ్యురు, చింతపల్లి నాయకులు సాగిన బుజ్జిబాబు, గూడెం లక్ష్మణ్, సిహెచ్ సిద్దు, జూర్రా, సూర్య ప్రకాష్ , పురా రాజేష్, గోకిరి, శ్రీనుబాబు, పొట్టిక రాంప్రసాద్, కారంగి నవీన్, సప్ప నగేష్, బెనుకుల బాలరాజు, తుర్రే సంజీవ్, కూడా దేవుడు, మొదలగు జనసైనికులు పాల్గొన్నారు.