జనసేన పార్టీలో చేరిన జెడ్డువారిపల్లె గ్రామస్తులు

నందికొట్కూరు నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో కొత్తపల్లి మండలానికి చెందిన జడ్డువారిపల్లె గ్రామస్తులు జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలు నచ్చి జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ బాధ్యులు నల్లమల రవికుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన అనంతరం జడ్డువారిపల్లె గ్రామస్తులు మాట్లాడుతూ జనసేన పార్టీ కొరకు ఎల్లవేళలా కృషి చేస్తామని, పొత్తులో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకుంటామని తెలియజేయడం జరిగింది. అలాగే నల్లమల రవికుమార్ మాట్లాడుతూ గడిచిన వైసీపీ ప్రభుత్వంలో నందికొట్కూరు నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని, నియోజకవర్గంలోని ప్రజలంతా మార్పు కొరకు వేచి చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శేఖర్, పెద్ద హస్సైనయ్య, రవికుమార్, హుస్సేన్ తదితరులు పార్టీ కండువాలు కప్పుకున్నారు.
అలాగే అదే గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకులు చిన్న మరియు కుమార్ మాట్లాడుతూ పొత్తులో భాగంగా ఉమ్మడి ప్రభుత్వాన్ని కచ్చితంగా గెలిపించవలసిందిగా కోరారు.