జగన్ రెడ్డి ఒక దొంగ అని దేశం మొత్తానికి తెలుసు: సోమరౌతు అనురాధ

ఉమ్మడి బాపట్ల జిల్లా, వేమూరు నియోజవర్గం, వేమూరు మండలంలో జనసేన కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో భాగంగా జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి సోమరౌతు అనురాధ మీడియాతో మాట్లాడం జరిగింది. ఈ సందర్భంగా అను రాధ మాట్లాడుతూ.. జగన్ రెడ్డి గారి లాంటి వాళ్ళని చూసే సామెతలు కనిపెట్టారు. ఆయన ఒక దొంగ అని దేశం మొత్తం తెలుసు. 16 నెలలు జైలులో ఎందుకు ఉన్నారో అందరికి తెలుసు. కొన్ని వేల కోట్లు స్కామ్ చేసిన కేసులో ముఖ్య ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డి గారు ఒక్క కేసు కూడా లేని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని దొంగల ముఠా అంటూ సంబోధించడం హాస్యాస్పదం. ఇప్పుడు ఆయన పెద్ద మోసగాడు .. మోసగాడు అని ఎందుకు సంబోధిస్తున్నానో అందిరికి తెలుసు. ముఖ్యమంత్రి అయినా తరువాత మాటలలో తప్పించి ఒక ఐటీ పరిశ్రమ తీసుకువచ్చింది లేదు, ఒక నిర్మాణం చేసినిది లేదు, ఒక రోడ్డు వేసింది లేదు. కేవలం డబ్బు పంచడం తప్పించి ఆయన ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమి లేదు. నిన్న కూడా ఇళ్ల పట్టాల పంపిణి పేరుతో చేసింది పెద్ద మోసమే.. కనీస అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ పట్టాల వల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగం లేదని.. ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వా సలహాదారులందారు చేతగాని పరిస్థితుల్లో ఉండడం వల్ల నిన్న అంత పెద్ద మోసం జరిగింది. అసలు సీ.ఆర్.డి.ఏ నుండి ప్రభుత్వం భూముల్ని పంచే అర్హత లేదు. ఎమ్మార్వోలు వాటికీ సంతకాలు పెట్టే అధికారం అస్సలు లేదు. కానీ చట్ట బద్ధత లేకుండా కొంత మంది అమాయకులకు ఆశ చూపించి వారిని తీసుకొచ్చి పట్టాల పంపిణి కార్యక్రమం చేశారు. న్నటి రోజున ప్రజలందరూ చూసారు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి అంతా ముందే తెలిసి జరిగింది అని సీబీఐ వారు కుండ బద్దలు కొట్టేశారు. సీబీఐ ఒక ముద్దయిని అరెస్ట్ చెయ్యాలని రాష్ట్ర పొలిసు శాఖని కోరితే పొలిసు వారి నుండి మద్దతు దొరకకపోవడం ఎంత సిగ్గు చేటో రాష్ట్ర ప్రజలందరి గమనించాలని జనసేన పార్టీ తరపున కోరుతున్నాం. సిబిఐ కోర్టులో పేర్కొన్న విషయంలో అర్ధరాత్రి 12 హెగంటల నుండి తెల్లవారు జామున 4 గంటల వరకు అవినాష్ రెడ్డి దగ్గర నుంచి జగన్ రెడ్డి గారికి వాట్సాప్ వీడియో కాల్స్ వెళ్లాయి అంటే.. గతంలో శ్రీ రఘు రామ కృష రాజు గారు పేర్కొన్న విషయాన్ని మనమందరం గుర్తు చేసుకోవాలి. ఆయన్ని సీఐడీ పోలీసులు కొడుతున్నప్పుడు వారి దగ్గర నుండి వాట్సాప్ లో ఫొటోస్, వీడియోస్ వెళ్లాయని.. వాటిని చూసి ఆయన శునకానందం పొందారన్న విషయాన్నీ ప్రజలందరికి గుర్తు చేస్తున్నాను. వీటినన్నిటిని కప్పి పుచ్చుకోవడానికి నా అక్కమ్మలు, నా చెల్లెమ్మలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నాడు. రేపో మాపో అవినాష్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా వివేకానందరెడ్డి గారి హత్యా కేసులో నిందుతుడవ్వడం ఖాయం. ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేస్తున్న మోసాలనై గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. సొంత బాబాయిని చంపించి ఆ కేసులో ఎన్ని అబద్దాలు ఆది ప్రజలని ఏ విధంగా మోసం చేస్తున్నాడో, కేసు ఉచ్చ్చు బిగుసుకున్న ప్రతి సారి ఢిల్లీ ఎహ్ విధంగా పరిగెడుతున్నాడో అందరు గమనించాలని కోతుకుతున్నాము. ఈ రాష్ట్రంలో ఎటువంటి నేర చరిత్ర లేని నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకునెలా ప్రజలందరూ కూడా జనసేన పార్టీకి మద్దతు పలికి అధికారాన్ని అందించి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించాలని కోరుతున్నాము అని అన్నారు. ఈ కారిక్రమములో జనసైనికులు నియోజవర్గ వీర మహిళ బొందలాపాటిమురళీకృష్ణ, అంజలి, ఎంపీటీసీ గాజుల నగేష్, ఎంపీటీసీ అభ్యర్థి తాడికొండ శివరామ కృష్ణా,గాజుల నవీన్, సోమారౌతు బ్రహ్మం, దేవిరెడ్డి మహేష్, అద్దంకి సూర్యనారాయణ, ఆలపాటి రాకేష్, ఏళ్ళమాటీ దాస్, దుర్గ ప్రసాద్, ఉప్పు భాస్కర్, వెలివెల శివ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.