జ్ఞానం అనే వెలుగులోకి నడిపిస్తున్న గురువులందరికి పాదాభివందనాలు: ఆదాడ మోహనరావు

విజయనగరం, సోమవారం ఉపాధ్యాయుల దినోత్సవం మరియు భారతరత్న, మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు అదాడ మోహనరావు కనపాక ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సర్వేపల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ భారతరత్న, మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ యావత్భారత దేశానికే గురువని, దేశానికి చేసిన సేవలు ఎనలేనివని, ఇటువంటి మహనీయున్ని ప్రతీ ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని, అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోకి నడిపించే గురువులందరికి జనసేన పార్టీ తరుపున పాదాభివందనాలని అన్నారు. ఇటువంటి గురువులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన, ఇస్తానన్న బకాయులు ఇవ్వాలని, ఇదేగురువులకు మద్యం షాపులవద్ద, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉంచడం వంటి నీచమైన సంస్కృతి మానుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు), జనసేన పార్టీ సీనియర్ నాయకులు పిడుగు సతీష్, నాయకులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, ముదిలి శ్రీనివాసరావు, అల్లాబోయిన శివ గణేష్ యాదవ్, యాతపేట రవి, రాజు పాల్గొనడం జరిగింది.