కౌలు రైతులకు అండగా పవనుడు

పెడన, కౌలు రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో తెలుగువారి నూతన సంవత్సర ఉగాది రోజున పవన్ కళ్యాణ్ చనిపోయిన కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తారని ప్రకటించడం రాష్ట్ర రైతుల పట్ల, వ్యవసాయం పట్ల పవన్ కళ్యాణ్ కి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ఇప్పటివరకు రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నాయకులనె చూసాం. తన కష్టార్జితంతో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలనె ఉద్దేశంతో ఎంతో ఉదార స్వభావం తో ముందుకు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఒక రైతు బిడ్డగా నేను రాష్ట్ర రైతాంగం తరఫున పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత వ్యవసాయ రంగం కుదేలైంది. వ్యవసాయ రంగానికి సరైన ప్రోత్సాహం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాదు. ఒకవేళ ప్రభుత్వం కొనుగోలు చేసిన సకాలంలో డబ్బు చెల్లించని పరిస్థితి. వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టి వేయబడింది. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. కౌలు కార్డుల జారీలో తీవ్ర జాప్యం. తద్వారా కౌలు రైతులు పంట అమ్ముకోవాలి అన్న, బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలన్న, పంట నష్టపరిహారాన్ని పొందాలన్న పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయ రంగానికి జీవం పోయాలి అన్న, రైతు కళ్లల్లో ఆనందం చూడాలన్నా అది పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం.
చేయి చేయి కలుపుదాం పవన్ అన్న తో పయనిద్దామని పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు సమ్మెట అన్నారు.