యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న వైసిపి ప్రభుత్వం

  • గళం విప్పుదాం… భవితను పొందుదాం.
  • యువతకు అండగా జనసేన.
  • అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ నెల 12న రణస్థలం వేదికగా గుండె గొంతుక వినిపిద్దాం.
  • జనసేన జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి.

అనంతపురం, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పిన వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం మాట తప్పి యువత భవితను నిర్వీర్యం చేశారు. నేటికీ నాలుగు జనవరి ఒకటో తేదీలు పోయిన ఇంతవరకు చెప్పుకోదగ్గ ఒక జాబ్ క్యాలెండర్ కూడా విడుదల కాలేదు. ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక వేలాదిమంది నిరుద్యోగులు నిరాశ నిస్పృహ పాలవుతున్నారు. వారందరికీ అండగా నిలిచేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు రావడం శుభపరిణామం జనసేన జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిలు అన్నారు. బుధవారం స్థానిక సప్తగిరి సర్కిల్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12వ తేదీన రణస్థలం వేదికగా మన యువత మన భవిత కొరకు నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఆసక్తిగల యువత పాల్గొనందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని.. ప్రత్యేకమైన ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి కేటాయించామన్నారు. వాయిస్ రికార్డర్ ద్వారా పనిచేసే ఈ ఫోన్ నెంబర్లు యువతీ యువకులు ఏ అంశం మీద మాట్లాడాలి అనుకుంటున్నారో క్లుప్తంగా వాయిస్ రికార్డ్ చేసి చెప్పవచ్చు. లేదా ఈ మెయిల్ కు రికార్డ్ చేసి పంపవచ్చు. ఆ వివరాలను పరిశీలించి పార్టీ కార్యాలయం నుంచి మీకు తగిన సమాచారం వస్తుందన్నారు. పేరు వివరాలు నమోదు చేయాల్సిన ఫోన్ నెంబర్ 080 69932222, ఈ-మెయిల్ వ్ర్విథ్జ్స్ప్క్@ జనసెనపర్త్య్.ఒర్గ్ కు వివరాలను పంపాలని కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ నెల 12న రణస్థలం వేదికగా గుండె గొంతుక వినిపిద్దామని టీ.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిలు పిలుపునిచ్చారు. జనసేన నాయకులను, వీరమహిళలు మరియు కార్యకర్తలు సమన్వయం చేసుకొని ఉమ్మడి అనంత జిల్లా నుండి పెద్ద సంఖ్యలో రణస్థలానికి తరలివెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, ప్రాంతీయ మహిళా కమిటీ సభ్యులు శ్రీమతి పెండ్యాల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్, ఐటి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్, నగర ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, జిల్లా కార్యదర్శులు సంజీవ రాయుడు, కిరణ్ కుమార్, ముప్పూరి కృష్ణ, విజయ్ కుమార్ నగర ప్రధాన కార్యదర్శులు రోళ్ళ భాస్కర్, మేదర వెంకటేష్, చక్రపాణి, వెంకటనారాయణ, హుస్సేన్, దరాజ్ భాషా, విశ్వనాథ, సంపత్, అంజి, లాల్ స్వామి, నగర సంయుక్త కార్యదర్శిలు నెట్టిగంటి హరీష్, ఆకుల అశోక్, మరియు నాయకులు చిరు, పవనిజం రాజు, చరణ్, శ్రీనివాస్, హిద్దూ, విజ్జి, చిన్న, మళ్లీ తదితరులు పాల్గొన్నారు.