ముస్లింల సంక్షేమాన్ని వైసీపీ విస్మరించింది: ముఖరంచాన్

దుల్హన్ పధకం విషయమై హైకోర్టు లో రాష్ట్రప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించలేదని చెప్పింది..!! ఈ విషయమై రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ మరియు రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి సయ్యద్ ముఖరంచాన్ స్పందిస్తూ గతంలో దుల్హన్ పథకం కింద అర్హులైన వారికి 50000 రూపాయలు వస్తుండేవి అని వాటిని వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లక్షరూపాయలు చేస్తామని ముస్లిం ప్రజానీకానికి నమ్మబలికింది కాని అధికారం లోకి వచ్చాక ఆ విషయాన్ని పట్టించుకునే పాపాన పోలేదని వైసిపి వి జగన్ రెడ్డి గారివి అన్నీ పైపైమెరుపులనీ యెద్దేవా చేసారు..

గత కొన్ని సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటిని నెలబెట్టుకోలేక పోయిందని అలాగే కేవలం ఎన్నికలలో ఓట్ల కోసమే మైనారిటీ లు వైసిపికి కావాలని చాన్ తెలియచేసారు..!! ఇదే విషయమై తాను ముస్లిం మైనారిటీ గా జనసేన పార్టీ లో ఉంటున్నాను కాబట్టి రానున్న రోజుల్లో ముస్లిం సహోదరులు వైసిపి భాగోతాన్ని గమనించి వారి చెరనుండి వీడాలని తను నమ్ముతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ని అంతా కలిసి ముఖ్యమంత్రి గా చేసుకుని ముస్లిం హక్కులను కాపాడుకుందామని.. ముస్లిం ల కోసం 2019లో జనసేన మానిఫెస్టో లోని సచార్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని దాని ద్వారా ముస్లిం ప్రజానీకానికి కలగబోయే లబ్దిని ఆయన సోషల్ మీడియా వేదికగా ముస్లిం ప్రజలకు ఉపోద్ఘాతమిచ్చారు.