షేక్‌ రియాజ్‌ ని కలిసిన పసుపులేటి చిరంజీవి

ఒంగోలు, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్‌ రియాజ్‌ ని జిల్లా జనసేన పార్టీ కార్యాలయం ఒంగోలులో శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్‌ కమిటీ సభ్యులు మరియు కురిచేడు మండలం పడమర గంగవరం పంచాయతీ వార్డు సభ్యులు పసుపులేటి చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్ఫగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దర్శి నియోజకవర్గములో పార్టీ కార్యక్రమాలు మరియు రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కార్యక్రమంలో జనసైనికులు పేరయ్య తదితరులు పాల్గొన్నారు.