మార్చి 1 నుండి థియేటర్లు బంద్..!

కరోనా వలన దాదాపు 9 నెలల పాటు థియేటర్స్ మూతపడ్డ సంగతి తెలిసిందే. దీని వలన ప్రజలకు పెద్ద తెర వినోదం కరువైంది. ఇక ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల థియేటర్స్ బాట పడుతుండగా, ఎగ్జిబిటర్స్ మార్చి 1నుండి థియేటర్స్ మూసివేస్తామంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు. నిన్న సాయంత్రం రామానాయుడు స్టూడియోలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు మధ్య మీటింగ్ జరగగా, ఈ మీటింగ్‌లో పలు డిమాండ్స్ వారి ముందుంచారు. వీటిని ఒప్పుకోని పక్షంలో మార్చి 1 నుండి థియేటర్స్ మూతబడతాయి అని స్పష్టం చేశారు.

మల్టీప్లెక్స్ థియేటర్ల తరహాలోనే సింగిల్ స్క్రీన్లకు కూడ పర్సంటేజ్ విధానం తప్పక అమలుపరచాలని చెప్పిన ఎగ్జిబిటర్లు ఓటీటీ విడుదల విషయంలో కూడ గట్టి కండిషన్ పెట్టారు. థియేటర్స్‌లో విడుదలైన 6 వారాల తర్వాత పెద్ద సినిమాలు, 4 వారాల తర్వాత చిన్న సినిమాలని ఓటీటీలో విడుదల చేయాలి. అలా చేస్తేనే మంచి థియేట్రికల్ రన్ ఉంటుందని వారు. సమావేశంలో ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, డివివి దానయ్య, అభిషేక్ నామా, ఆసియన్ సునీల్, మైత్రీ మూవీస్ నిర్మాతలు, బివిఎస్ఎన్ ప్రసాద్ హాజరు కాగా, వీరు ఎగ్జిబిటర్స్ కండీషన్స్‌కు కట్టుబడి ఉంటే సినిమాలు యధావిదిగా థియేటర్‌లో ప్రదర్శితం అవుతాయి. లేదంటే సినీ ప్రియులకు మరోసారి నిరాశ తప్పకపోవచ్చు.