ఆంధ్రాలోనూ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.. సయ్యద్ నాగుర్ వలి

సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండల కేంద్ర జనసేన కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రెస్ మీట్ లో నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి మాట్లాడుతూ.. ఆంధ్రాలో కూడ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని తెలిపారు. జనసైనికులకు పలు సూచనలు చేసారు, 175+25 నియోజకవర్గాలలోను పని చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఏ నియోజకవర్గంని కూడ విడిచి పెట్టకూడదు. కార్యకర్తలకు నాయకులుగా మారే అవకాశం పని చేసుకుంటూ వెళ్ళండి, టికెట్ అదే వస్తుంది. అలాగే మల్లి చివరిలో అంటే ఇబ్బంది పడతాం, అందుకే ఇప్పటి నుండే కమిటీలు కూడ వేసుకొండి. గ్రూప్ రాజకీయం ఉండకూడదు, జనసేన వాటిని సహించదు. నియోజకవర్గంలో నాయకులు ఎవరో వస్తారని జనసైనికులు ఎదురు చూడ కాకుండా, మీరే నాయకులుగా మారి జనసేన జెండాను ఎగురవేయండి. 175 స్థానాలలోను ఒంటరిగానే పోటీ చేసే అవకాశమే అధికం. ఇదే జరగవచ్చు కూడ. అందువల్ల మీ వ్యూహాలు మీరు వేసి, ఒంటరి పోరుకు సిద్ధం కండి. పొత్తుల ప్రస్తావన వద్దు, జనసేన ప్రస్తావన ముద్దు. జనసేనకి ఒక్క అవకాశం అంటూ జనంలోకి వెళ్ళండి. మీరు చేసే ప్రతి కార్యక్రమం తెలియజేయండి. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటే, వెంటనే బస్ యాత్ర మొదలు అవుతుంది. ఈ విషయంలో మీకు భయం అక్కరలేదు. దానికి తగ్గ పని మీరు చేసుకొండి, ప్రతి గ్రామంలో కమిటీలు వెయ్యండి. రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర మన పార్టీ ఏజెంట్లు పక్కా ఉండాలని నాగుర్ వలి తెలిపారు.