ఆయన పేరులోనే స్ఫూర్తి ఉంది

  • భారతదేశంలో అత్యున్నత రెండో పురస్కారం అందడం మా అందరికీ పండుగ
  • ఊహ తెలియని రోజుల నుంచి ఆయన సేవా బావాలు ముందుకు తీసుకెళ్లిన చిరంజీవి యువత దీనిలో భాగస్వాములే
  • యంగ్ ఇండియన్ ట్రస్ట్ వారు వారి సేవ గుణాన్ని ముందుకు తీసుకెళ్తూ క్యాన్సర్ తో బాధపడుతున్న పిల్లవాడికి 25000 డొనేట్ చేయడం హర్షిణీయం
  • ఆయన స్థాయి వేరు, వారు శిఖరం

నెల్లూరు: పద్మభూషణ్ డా మెగాస్టార్ చిరంజీవికి, కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించిన సందర్భంగా, నెల్లూరు జిల్లా చిరంజీవి యువత మరియు కాపురాక్స్ యంగ్ ఇండియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, కేక్ కటింగ్, బాణాసంచా పేల్చి, నెల్లూరు నర్తకి సెంటర్ లో ఘనంగా పండగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, క్యాన్సర్ తో బాధపడుతున్న ఆరిగేళ్ల సూర్యతేజ అనే 3సంవత్సరాల కుర్రానికి రూ.20,000, అతని ట్రీట్మెంట్ కి గాను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు యేటూరి రవికుమార్, అఖిలభారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర చిరంజీవి యువత కార్యదర్శి కొట్టె వెంకటేశ్వర్లు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు ఈగి సురేష్, జిల్లా రాంచరణ్ యువత అధ్యక్షులు మేకల ప్రసాద్, జిల్లా వరుణ్ తేజ యువత అధ్యక్షులు గుర్రం కిషోర్, జిల్లా సాయి ధరమ్ తేజ్ యువత అధ్యక్షులు ఇంగిలేల విష్ణువర్ధన్, నోవా బ్లడ్ బ్యాంకు భవిశెట్టి కిషోర్, కాపురాక్స్ స్టేట్ ప్రో పసుమర్తి కిషోర్, ప్రశాంత్, గంగిశెట్టి నరసింహ, వెంకట సాయి, శివ, వరుణ్, సాయిప్రశాంత్, కిషోర్, సంతోష్, రాఘవనాయుడు, హేమచంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.