తాగునీరు, డ్రైనేజీ, రోడ్డు మార్గం శూన్యం

కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం, పామర్రు పంచాయతీ పరిధిలోని వీరాంజనేయ కాలనీ వాసుల అవస్థలు, కనీస మౌళిక సదుపాయాలు లేని కాలనీ, 2004లో ఏర్పాటుచేసిన వీరాంజనేయ కాలనీ, ఇప్పటివరకు త్రాగునీరు డ్రైనేజీ రోడ్లు సదుపాయాలు సరిగా లేవు, చిన్నపాటి వాళ్లు వస్తే రోడ్లన్నీ జలమయం, ఎన్నిసార్లు పంచాయతీ అధికారులు అడిగిన పట్టించుకోని పంచాయతీ అధికారులు పాలకవర్గం, కాలనీవాసులు తమ సమస్యలను జనసేన పార్టీ కార్యకర్తలతో సంప్రదించగా, వీరాంజనేయ కాలనీవాసులు జనసేన పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ పామర్రు ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్ తో కలిసి నిరసనగా ర్యాలీతో పంచాయితీ ఆఫీస్ కి వెళ్ళాక అక్కడ పంచాయతీ అధికారులు గాని సర్పంచ్ గాని అందుబాటులో లేరు, సుమారు రెండు గంటలపాటు పంచాయతీ ఆఫీస్ దగ్గర నిరసన తెలిపినారు, రెండు గంటల తర్వాత పంచాయతీ ఆఫీసర్ కి వీరాంజనేయ కాలనీకి మౌళికవసతులు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేయగా సదరు ఆఫీసర్ నెల రోజుల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినాడు, నిరసన చేసే టైంలో జోరున వర్షాన్ని కూడా లెక్కచేయకుండా జనసైనికులు నిరసన తెలియజేశారు జనసేన పార్టీ ఇన్చార్జి నరేష్ మాట్లాడుతూ నెలరోజుల లోపు మౌళికవసతులు ఏర్పాటు చేయకపోతే పంచాయితీ ఆఫీస్ వద్ద నిరాహారదీక్ష చేస్తానని జనసేన పార్టీ తరఫున హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాపర్ల ఎంపిటిసి కొనపరెడ్డి సుబ్బారావు, కాకి ఝాన్సీ, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.