పించనులు తిరిగి పునరుద్ధరించే వరకు వదిలే ప్రసక్తి లేదు: ముత్తా శశిధర్

కాకినాడ సిటిలో జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు మరియు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్తా శశిధర్ 43 బి, పరిధిలో నివసిస్తున్న పెద్దలకు పింఛన్లు రద్దు చేస్తాము అని నోటీసులు ఇచ్చినట్లు తెలుసుకొని 43 వ డివిజన్ అధ్యక్షులు చోడిశెట్టి శ్రీమన్నారాయణ ఆద్వర్యంలో సాయంత్రం 5 గంటలకు నిజనిర్ధారణ ద్వారా వాస్తవాలను వెలుగుచూపే ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులకు అండగా ఉంటామంటూ ఆయన వారికి లెటరు పంపడమే కాకుండా స్వయంగా కలిసి సంఘీభావాన్ని తెలియచేస్తూ తను చేతల మనిషినన్నది నిరూపించారు. బాధితులైన అమలదాసు వెంకటేశ్వర్లు, కొయ్యా పాపారత్నం, దవులూరి వెంకట్రావు తదితరుల ఇళ్ళని అక్కడి పరిస్థితులని పరిశీలించి నివ్వెరపోయారు. వారుంటున్న పరిస్థితులను, వాస్తవాలపై అవగాహన ఉన్న ఏఒక్కరైనా ఈ పించను నిలుపుదల నోటీసులను చూసి దిగ్బ్రాంతి చెందుతారన్నారు. అసలు కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఏదైనా ఆస్తి ఒకరిపైన ఉంటే దానిపై మిగిలిన కుటుంబ సభ్యుల అందరికీ హక్కు కానీ వాటా కానీ ఉన్నట్టు ప్రభుత్వం భావించడం హాస్యాస్పదంగా ఉందనీ, ఇలా ఏదన్నా చట్ట సవరణ చేయబోతున్నారా అని ప్రశ్నించారు. పేదరికం వల్ల కుటుంబసభ్యులు అందరు ఒకచోటే సర్దుకుంటూ ఎవరి బతుకులు వారు బతుకుతారని ఈ విషయం సమాజంలో అందరికీ తెలుసనీ, కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం తెలియదని ఎద్దేవా చేసారు. వికలాంగులని , వృద్ధ మహిళలు అనికూడా చూడకుండా ఇలా తిప్పుతూ ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవడం మానవత్వం కాదన్నారు. బాధితులందరి తరపున జనసేన అండగా నిలుస్తుందనీ, వారికి పించనులు తిరిగి పునరుద్ధరించే వరకు వదిలే ప్రసక్తి లేదని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ సిటి అధ్యక్షుడు సంగిసెట్టి అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, 43 వ వార్డ్ జనరల్ సెక్రటరీ మున్నా, చిరంజీవి, యోగి, మహేష్ ప్రసాద్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.