సీఎం జగన్ వ్యాఖ్యలను ఖండించిన తీగల

గూడూరు నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ రాష్ట్ర అభివృద్ధి, పాలసీలు గురించి మాట్లాడితే పెళ్లిళ్ల గురించి జగన్ మోహన్ రెడ్డి నీతి మాలిన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్ర శేఖర్ రావ్ అన్నారు. గూడూరు నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జగన్ మోహన్ రెడ్డి చెత్త వాగుడు వాగుతున్నారన్నారు. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం హైదరాబాద్ లోని ఎఫ్.ఓ.ఏ కంపెనీలో ఎందుకు ఉంది ఆ కంపెనీ ఎవరిదో చెప్పాలన్నారు. ఏ ఒక్క వాలంటీర్ కి ఐడీ కార్డు లేదని, కొంతమంది వాలంటీర్ లు మహిళలు మైనర్ బాలికలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడ్డారాని ఆ సంఘటనలకు భాధ్యులు ఎవరని, వాలుంటీర్లు సేకరిస్తున్న డేటా దుర్వినియోగం అవుతుంటే ఏ అధికారి, ఏ మంత్రి బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. ఆధార్ బ్యాంకు డీటెయిల్స్, యువతులు అలాగే అవివాహితుల వివరాలను, ఫోన్ నెంబర్లను ఏ కారణంతో తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. అలాగే ఏ ఒక్క వాలంటీర్ కి ఐడి కార్డు కూడా లేని విషయం తెలిసిందేనని, వీరు సేకరిస్తున్న విషయాలు ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి కుటుంబ చరిత్ర గురించి కూడా మేము కూడా మాట్లాడగలమని వైయస్సార్ చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి కలకత్తాలో ఉన్న మాట వాస్తవం కాదా అని, ఆ సమయంలో హోటల్ లో ఏ మీటింగ్ లో ఉన్నారో చెప్పాలన్నారు. బెంగళూరు ప్యాలెస్ లో చేసిన అరాచకాల చిట్టా అందరికి తెలుసని అలాగే అక్కడ జరిగిన రాష్ట్రాలలో గంట, అరగంట కార్యక్రమాల వివరాలు బయటకు వస్తాయని ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వందల కోట్లు నిధుల పేరిట అధికారులతో పంపించడం జరిగిందని, ఈ విషయాన్ని కూడా త్వరలోనే బయటపెడతామన్నారు. మీ కుటుంబంలో ఉన్న అక్రమ సంబంధాల గురించి వాటి వల్ల జరిగిన అరాచకాల గురించి కడప జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారని, మరోసారి చెత్తవాగుడు ఆగితే మూల్యం చెల్లించుకోవడం తప్పదు అన్నారు. నువ్వు మాట్లాడే ప్రతీ మాటలోనూ, మాటల్లోనూ నీ ఓటమి కనిపిస్తుందని రాబోయే రోజుల్లో ప్రజల తగిన బుద్ధి చెప్తారు అన్నారు. అనంతరం పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఇంద్రవర్ధన్, విష్ణు, శివ లు మాట్లాడుతూ రాష్ట్రంలోని యువశక్తిని నిర్వీర్యం చేస్తూ శ్రమ దోపిడీ చేస్తున్న జగన్ సీఎంగా అనర్హుడన్నారు. మాకు సంస్కారం వుంది కాబట్టే ఇప్పటివరకు నీ వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదని, ఇకపై నువ్వు పవన్ వ్యక్తిగత విషయాల జోలికి వస్తే జనసైనికులు నీ వంశ నీచ చరిత్ర బయట పెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు అవినాష్, సనత్, సాయి, శ్రీనాథ్, వసంత్, తదితరులు పాల్గొన్నారు.