జనసేన నాయకులను సత్కరించిన తిరువూరు జనసేన

తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలానికి ఓ ప్రైవేటు కార్యక్రమం నిమిత్తం విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు మరియు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సహాయకులు గోవిందు అంజిబాబు మరియు జనసేన నాయకులు తోట శ్రీనివాసరావులను శుక్రవారం మధ్యాహ్నం తోటమూలలోని ముత్యాలమ్మ గుడి వద్ద వారికి ఘనస్వాగతం పలికి మర్యాదపూర్వకంగా కలిసిన జనసైనికులు. అనంతరం వారిని దుశ్శాలువాతో సత్కరించిన తిరువూరు నియోజకవర్గ జనసేన నాయకులు మరియు జనసైనికులు. ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ జనసేన నాయకులు మరియు కృష్ణాజిల్లా జనసేన కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావు, గంపలగూడెం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చింతలపాటి వెంకట కృష్ణారావు, గాదె వారి గూడెం సర్పంచ్ చెన్నా శ్రీనివాసరావు, ఏ కొండూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు లకావత్ విజయ్, వట్టికొండ కృష్ణ,చిలక వినోద్ కుమార్, వెంపాటి ఏసయ్య, ముది గండ్ల సాయి, తుళ్లూరు విశ్వనాథం, కంటిపూడి మురళి, కోలుసు రాంబాబు, పెనుగొలను ఓరుగంటి సురేష్, బాలకృష్ణ, గాదె రామకృష్ణ, గాదె గ్యాంగ్, రాళ్ల చర్ల రామకృష్ణ, లాకావతు సాయి, తదితర జనసైనికులు పాల్గొన్నారు. అనంతరం అమ్మిశెట్టి వాసు మరియు అంజిబాబు గాదె వారి గూడెం జనసేన సర్పంచ్ చెన్నా శ్రీనివాసరావుని దుశ్శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా తిరువూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు మరియు అంజిబాబు లకు వివరించిన జిల్లా కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావు. సావధానంగా విన్న నేతలు, ఈ సమస్యల్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళతామని హామీ ఇవ్వడం జరిగింది.