దేవి నవరాత్రుల మహోత్సవాలలో జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ

రాజమండ్రి సిటీ, స్థానిక చందా సత్రం వద్ద శ్రీ దేవి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా బెంగాలీ సోదరుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ హాజరవడం జరిగింది. ఉత్సవ కమిటీ సభ్యులు అనుశ్రీ సత్యనారాయణను స్వామియజుల పవన్ కుమార్ మర్యాదలతో సాదరంగా ఆహ్వానించడం జరిగింది, ఆలయ పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గమ్మ మండపాన్ని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ వై.వి.డి ప్రసాద్, రాజమండ్రి కార్పొరేషన్ కార్యదర్శి గుణ్ణం శ్యాంసుందర్, రాజమండ్రి సిటీ కార్పొరేషన్ జాయింట్ సెక్రెటరీ దేవకివాడి పాల్గొన్నారు.