ఇమ్మడి కాశీనాధ్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా జనసేన నాయకులకు ఘన సన్మానం


మార్కాపురం, జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ప్రభకు ప్రకాశం జిల్లా నుండి విచ్చేసిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, జిల్లా ఇంఛార్జ్ లకు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ కు, జిల్లా కార్యదర్శులకు, జనసేన నాయకులకు, వీర మహిళలకు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ చేతుల మీదుగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశినాధ్, గిద్దలూరు ఇంచార్జ్ బెల్లంకొండ సాయిబాబ, జనసేన పార్టి అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసినికులు పాల్గొన్నారు.