పాఠాలు చెప్తున్న వాళ్లు వాటిని పాటిస్తే బాగుంటుంది: నరేంద్ర మోడీ

దేశంలో ప్రజాస్వామ్యం లేదన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రజాస్వామ్యంపై తనకు పాఠాలు చెప్తున్న వారూ పాటిస్తే బాగుంటుందన్నారు. పుదుచ్చెరిలో లోకల్ బడీ ఎలక్షన్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా పట్టించుకోని కాంగ్రెస్. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యస్పదమన్నారు. జమ్మూకశ్మీర్ లో ఆయుష్మాన్ భారత్ స్కీంను వీడియో కాన్ఫరెన్స్ తో ప్రారంభించారు ప్రధాని మోడీ. కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. ఈ మధ్య జమ్మూలో జరిగిన DDC ఎన్నికల్లో జనం ప్రజాస్వామ్యాన్ని బలపరిచారని చెప్పారు మోడీ.