రాజ్యాంగాన్ని రక్షించాలంటే వైకాపాని గద్దె దించాలి

  • జనసేన నేత గురాన అయ్యలు

విజయనగరం: వైకాపా సర్కార్ ను ఓడిస్తేనే రాజ్యాంగానికి రక్షణ ఉంటుందని, ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్ని ఒక్కటవ్వాల్సిన ఆవశ్యకత ఉందని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. రాజ్యాంగ దినోత్స వాన్ని పురస్కరించుకుని అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూలమాలలు వేసి
ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రంలో ప్రజా పాలన రావాలి.. సైకో రాజ్యం పోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాని గద్దె దించకపోతే రాజ్యాంగ మనుగడే ప్రశ్నార్తకం అవుతుందన్నారు. ప్రశ్నించే గొంతుకలపై ఈడీ, సీఐడీ దాడులు పరిపాటిగా మారాయన్నారు. రాజ్యంగబద్దంగా పనిచేయాల్సిన దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం పోయి.. అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావాలన్నారు. అధికారంలోకి వచ్చి ప్రజా వేదికను కూలదోయడంతో ప్రారంభమైన వైకాపా పాలన.. అవినీతి, అక్రమాలు, అరాచకాలతో సాగుతోందని ఆరోపించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ ధ్యేయంగా టీడీపీతో కలిసి ముందుకెళుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గ జనసేన-టిడిపి సమన్వయకర్త ఆదాడ మోహన్ రావు, విజయనగరం నియోజక వర్గ జనసేన నాయకులు పితాల లక్ష్మీ, దుప్పాడ జ్యోతి, ఏంటి రాజేష్, పిడుగు సతీష్, గొల్లపల్లి మహేష్, ఎమ్ .పవన్ కుమార్, పృథ్వీ భార్గవ్, కె.సాయి, మధు తదితరులు పాల్గొన్నారు.