రాజ శ్యామల చండి యాగాన్ని సందర్శించిన సువర్ణ రాజు

రాజానగరం నియోజకవర్గం: గాదరాడ గ్రామంలో రాజానగరం జనసేన పార్టీ ఇంఛార్జి బత్తుల బలరామ కృష్ణ దంపతులచే నిర్వహించబడుతున్న శ్రీ రాజ శ్యామల చండి యాగాన్ని గోపాలపురం నియోజకవర్గం నుండి గోపాలపురంనియోజక ఇంఛార్జి సువర్ణ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు సన్మానం చేసి శక్తి పీఠాల ఫోటోను బహూకరించడం జరిగింది. అలాగే నియోజకవర్గం తరుపున బలరామ కృష్ణ దంపతులను సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజక ఇంఛార్జి సువర్ణ రాజు, దేవరపల్లి గ్రామ అద్యక్షులు కంబాలసత్తిబాబు, త్యాజం పుడి ఎంపీటీసీ కాళ్ళ వెంకటరత్నం, చప్పటి శివ, జాజిమోగ్గల శ్రీనివాస్(జెకె), సూరిసెట్టి బాలు, ప్రదీప్, తతబ్బాయి, నిజాంపుడి నాగరాజు, వీరమహిళలు కవల సీత, సౌజన్య మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.