నేడు ఎంపీ అరవింద్ రోడ్ షో..

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ ధర్మపురి అరవింద్ నేడు రోడ్ షో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు సోమాజీగూడ నుంచి ఈ రోడ్ షో ప్రారంభం కానుంది. ఉదయం 11గంటలకు యూసుఫ్ గూడ.. సాయంత్రం 5గంటలకు బంజారాహిల్స్.. 6 గంటలకు చింతల్ బస్తీ, రెడ్ హిల్స్.. 7 గంటలకు విజయనగర్ కాలనీలో బీజేపీ అభ్యర్థుల తరుపున ఎంపీ అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.