ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ – ఓడిపోయే ప్రభుత్వానికి ప్రకటించే పథకాలు ఎక్కువ

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, పెళ్లి కానుక ఇవ్వటానికి పదో తరగతి షరతులు పెట్టడం మరొక్కసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీల ఆడపిల్లలకు చేస్తున్న పచ్చి మోసం. జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో విలేకరుల ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ముబీనా మాట్లాడుతూ వైయస్సార్ దుల్హన్ పథకం పేరుని షాది తోఫా దుల్హన్ అనే పేరు మార్చి దుల్హన్ అంటే పెళ్లికూతురు ఆడపిల్ల పేరు మీద ఉన్న దుల్హన్ పథకాన్ని పేరు మార్చి షాది తోఫా అనే పేరు పెట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరిపై నిబంధనలు అమలు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ముస్లిం మైనార్టీ ఆడపిల్లలు అంటే జగన్మోహన్ రెడ్డి కి అంత చులకన ఎందుకని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముస్లిం మైనార్టీల గురించి కనీసం అవగాహన ఉందా అని, ముస్లిం మైనార్టీల స్థితిగతులు నిరక్షరాస్యత ముస్లిం మైనార్టీల పేదరికం అన్నీ కూడా పార్లమెంట్లో సమర్పిస్తే ముస్లిం మైనార్టీల పిల్లల పెళ్లిళ్లకు పదో తరగతి చదివి ఉండాలి అనే నిబంధన పెట్టడం అత్యంత బాధాకరమని, ఈ పథకంలో పెట్టిన షరతులు చూస్తుంటే ముస్లిం మైనార్టీ ఆడపిల్లల పైన వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందని, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది ఏంటి దుల్హన్ పథకం కింద ప్రతి మైనారిటీ ఆడపిల్లలకు లక్ష రూపాయలు పెళ్ళికానుక ఇస్తానన్నారని కానీ ఈ మూడున్నర సంవత్సరాలలో ఎంతమంది ఆడపిల్లలు పెళ్లిళ్లు చేసుకున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్లందర్నీ మోసం చేసినట్టు కాదా? అని, పెళ్ళికానుక పథకం అమలు చేస్తే ఈ మూడున్నర సంవత్సరాలలో ఎంతమంది పెళ్లిళ్లు చేసుకున్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని, అప్పుడే ఆ పథకం అమలు చేసినట్టు అవుతుందనీ, పథకాలు పెట్టాలి కానీ లబ్ధిదారులు తక్కువగా ఉండాలి అనే భావనతో ఉంటే ఇలాంటి కండిషన్స్ పెట్టి ప్రజలను మోసం చేయొచ్చు ఆలోచనలు ఉన్నారని, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి అని ఎన్నికల కోసం ప్రకటన చేసినట్లు ఉంది ఈ షాదీ తోఫా పథకం అని ,పశ్చిమ నియోజకవర్గంలోనే హాస్ హౌస్ నిర్మాణం చెయ్యాలని, షాదీ ఖానా ముఖ్యమంత్రిచే ప్రారంభించిన ఇప్పటికే కబరిస్తాం లాగే ఉందని, సీఎం జగన్ మోహన్ రెడ్డికి మైనారిటీల పైన నిజంగా చెత్తశుద్ధి ఉంటే షాది ఖానా సామాన్య ముస్లింలకు 5000 అద్దెకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన యువనాయకులు హనుమాన్ , పోలిశెట్టి శివ బుద్దన ప్రసాద్, నాగరాజు, సాంబ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.