గోవాలో తౌటే తుఫాన్ బీభత్సం..!

పనాజీ: గోవాలో తౌటే తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్నది. ఆరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ తీరం వైపు దూసుకొస్తున్నా కొద్దీ గోవా తీరం మరింత అల్లకల్లోలంగా మారుతున్నది. సముద్రంలో పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న అలలు, బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే గోవా తీర ప్రాంతాల్లో 100 పెద్ద ఇండ్లు, మరో 100 చిన్నచిన్న ఇండ్లు ధ్వంసమయ్యాయి.

ఈ ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు దాదాపు 500కు పైగా చెట్లు నేలకూలాయి. వర్షం కారణంగా భారీగా వరదనీరు చేరడంతో రోడ్లన్నీ జలమయమై పలుచోట్ల రాకపోకలు స్తంభించిపోయాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరా కరెంటు స్తంభాలు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ వివరాలను వెల్లడించారు.