కాలక్షేపం కోసం, సోషల్ స్టేటస్ కోసం కాదు జనసేనతో ప్రయాణం

పచ్చని పంట చేలను చూసి పరవశించిపోవడం వేరు.. వ్యవసాయం చేయాలనుకోవడం వేరు.. అలాగే మహా నాయకుల ప్రసంగాలు విని ఉద్వేగానికి గురికావడం వేరు.. రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకోవడం వేరు.. ఎవరికైనా పంటచేల మధ్య పచార్లు కొడుతుంటే హాయిగానే ఉంటుంది. వ్యవసాయం చేయడంలోనూ ఆ హాయి ఉన్నా ఎంతో కష్టం కూడా దాంతో పాటే ఉంటుంది. మంత్రులనో, ముఖ్యమంత్రులనో చూసి వాళ్లకున్న అధికారాలను, వాళ్లకున్న అవకాశాలను మాత్రమే చూసి రాజకీయ నాయకులం కావాలనుకుంటే ఎలా? ప్రజల మధ్య నిలబడి ఎంత కాలం పనిచేస్తే, ఎన్ని హోరాహోరీ పోరాటాలు చేస్తే ఆ అధికార హోదా చేతికి వస్తుంది? ఆ అవగాహన కావాలి.. రాజకీయాల్లోకి వెళ్ళొద్దని కాదు.. దానికన్నా ముందు ఆ రంగంలోని వ్యయప్రయాసలేమిటో తెలుసుకోవాలి. అందుకు అవసరమైన శారీరక, మానసిక, ఆర్ధిక శక్తి మనలో ఏ మేరకు ఉందొ ఒక అంచనా వేసుకోవాలి.. కేవలం అంచనా వేసుకుంటే సరిపోదు. ఎంత ఆచరణాత్మకంగా ఉండగలమో కూడా చూసుకోవాలి లోతైన అథ్యయనం చేయాలి. కొంత శిక్షణ కూడా పొందాలి. దాన్నుంచి అనుభవం సాధించాలి. అవేమీ లేకుండా, ఏదో ఉద్వేగానికి లోనై ఆవేశంగా ఆ రంగంలోకి దూకేస్తే మోకాళ్ళు విరిగి బొక్కబోర్లా పడటం తప్పదు. పంటచేలను చూసో, విజయవంతమైన సినిమాలను చూసో, ప్రజాభిమానాన్ని చూరగొన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ని చూసో ప్రభావితం కావొద్దు. అయితే వాటి వెనకున్న అగాధాలు, చీకటి కోణాలు గురించి క్షుణ్ణంగా తెలుసుకొని వాటన్నింటికీ సిద్ధపడితే ఆయా రంగాలను ఎంచుకోవచ్చు. వాటన్నింటికి సిద్ధపడాలి వాస్తవంగా భరించగలిగే మనోధైర్యం ఉంటే ఖచ్చితంగా ఆయా రంగాల్లో ప్రవేశించి విజయాలు సాధించవచ్చు. అంతేగానీ.. పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదల కోరుకునే అనుచరుడివి నువ్వైతే అతనికి రక్షగా ఉండాలి తప్ప నువ్వే అవరోధం అవ్వకూడదు. మనం చేయలేని పని పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. పార్టీకి మద్దతుగా నిలబడాలి..బాధ్యతగా ప్రవర్తించాలి.. అంతేగానీ..కేవలం సోషల్ మీడియాలో స్టేటస్ కోసం పార్టీ కార్యక్రమాలకు మొక్కుబడిగా వచ్చి, హడావుడి చేసి, క్రమశిక్షణ లేని వారితో పార్టీకి ఎటువంటి బలం చేకూరదు.

గోపాలకృష్ణ,
రాజేంద్రనగర్ నియోజకకర్గం.